What’s Happening
పేద ప్రజల వైద్య చికిత్సల ఆర్థిక సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 8 కోట్ల 27 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా. శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ వద్ద అంగరంగ వైభవంగా ప్రారంభమైనది.
జిల్లా అధికారులు గణేష్ నిమజ్జనం నోడల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తునందున సోమవారం గ్రీవెన్స్ డే రద్దు పర్స్తున్నట్లుజిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.
Press Release
గ్రామాలలో ప్రజల అవసరాలకనుగుణంగా మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్‌ను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.
వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ఖమ్మం జిల్లా ప్రసిద్ధి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి యస్. నిరంజన్‌రెడ్డి అన్నారు.
ఓటరు జాబితాలో నూతన నమోదులు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందిన క్లెయిమ్ లపై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్జ్ అన్నారు.
వానా కాలం పంట సీజన్‌కు జిల్లా రైతాంగానికి అవసరమైన విత్తనాల పంపిణీకి ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు.
Photo Gallery
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 29న ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన “ధరణీ పోర్టల్” నేటికి దిగ్విజయంగా సంవత్సరకాలం పూర్తి చేసుకొని రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా వ్యవసాయ భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను మరింత సులువుగా జిల్లా ప్రజలకు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ది మాదిరిగానే ఉచిత న్యాయసేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు జిల్లా యంత్రాంగం సహాకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ శ్రీమతి వై రేణుక అన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ ఓటరు జాబితాను పకడ్బందిగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా రెండు డోసులు తప్పనిసరిగా తీసుకునేలా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ఈ నెల 30వ తేది తల్లాడలో నిర్వహించనున్న మోడల్ లీగల్ సర్వీసెస్ క్యాంపులో జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లబ్దిని అర్హులందరికి అందించే విధంగా విస్తృత స్థాయిలో అవగాహనపరిచే కార్యక్రమాల స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టరు యన్.మధుసూదన్ ఆయా శాఖల అధికారులకు సూచించారు.