- బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- మన ఊరు- మన బడి కార్యక్రమం అందరిది పనులు నాణ్యత గా ఉండాలి నాసిరకం పనులు సహించబోం పాఠశాలల ప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలి ఈనెల 25లోగా నియోజకవర్గానికి రెండు మోడల్ పాఠశాలలను సిద్ధం చేసి ఇవ్వాలి ప్రతి మండలంలో రెండు గ్రామీణ క్రీడ ప్రాంగణాలను మోడల్ గా సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తిచేయాలని టి ఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
- కాలం ఎంతో విలువైనదని, గడిచిన కాలం తిరిగి రాదని, ఎప్పుడు చేసే పనులు అప్పుడు చేస్తేనే బాగుంటుందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు.
- అకాల వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో ధాన్యం సేకరణ ను వేగవంతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
- పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి ….. అదనపు కలెక్టర్ వీరారెడ్డి
- ంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి
- పొగాకు రహిత జిల్లా యే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు పనిచేయాలని స్థానిక సంస్థల అధినపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు.
- దోమల వ్యాప్తిని అరికట్టడంతో పాటు పరిశుభ్రత పాటిస్తే డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు.
- జిల్లాను నకిలీ విత్తనాలు,కల్తీ మందులు లేని జిల్లాగా రూపొందించాలి..,… అదనపు కలెక్టర్ వీరారెడ్డి
- ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ సేవలు అందించే విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి వసతులను కల్పిస్తుందని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా.జి. శ్రీనివాస రావు పేర్కొన్నారు.
- మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలి నాణ్యత విషయంలో రాజీ పడరాదు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలను సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలి 30 లక్షల అంచనాలు గల పాఠశాలల పనులను వెంటనే ప్రారంభించాలి…… అదనపు కలెక్టర్ రాజర్షి షా
- జిల్లాలో నేటి నుండి (శుక్రవారం) ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
- సమాజంలో మార్పు వచ్చినప్పుడే కులవివక్షత రూపు మాసి పోతుందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు.
- ఎనిమిదవ విడత హరితహారానికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలి……. అదనపు కలెక్టర్ రాజర్షి షా ఎనిమిదవ విడత హరితహారానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.
- హారితహారం లక్ష్యసాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి…. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం పెంచడమే ఎనిమిదవ విడత హరితహారం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు.
- జిల్లాలో మే 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
- కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ పేరిట ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించుటకు ఈ నెల 24 నుండి మే 1 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
- కోహిర్ మండలం బిలాల్ పూర్ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.
- రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ నెల 23, 24 తేదీలలో హైదరాబాదులో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం నాడు ఒక ఒక ప్రకటనలో తెలిపారు.
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి – మంత్రి తన్నీరు హరీష్ రావు
- దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా స్థిరపడాలి- పారదర్శకంగా దళిత బంధును అందజేస్తున్నాం .. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు
- రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిని కార్పొరేట్ కు ధీటుగా తయారు చేయడమే లక్ష్యం సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలను రూ.217 కోట్లతో బాగు చేసుకోబోతున్నాం …… మంత్రి హరీష్ రావు
- రాష్ట్రంలో 91 వేల వివిధ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం….మంత్రి హరీశ్ రావు.
- రాష్ట్రంలో ప్రప్రథమంగా జిల్లాలో అభయ హస్తం పథకం లో 62,693 మంది మహిళలకు రూ.16.53 కోట్లు పంపిణీ చేసిన మంత్రులు తన్నీర్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు రూ.72 కోట్లు బ్యాంక్ లింకేజీ ,శ్రీనిధి రుణాల చెక్కుల పంపిణీ
- జిల్లాలో పండిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి….. ధాన్యం సేకరణకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
- ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను ఈ నెల 16 వరకు తెలుపాలి – జిల్లా కలెక్టర్
- మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘ సంస్కర్త శతాబ్దాలుగా నిస్సహాయులై ఉన్నవారి కోసం జీవితమంతా శ్రమించిన త్యాగశీలి పూలే అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సిద్ధి కి కృషి చేద్దాం ….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- ఈ నెల 11న మహాత్మ జ్యోతిరావ్ పూలే 196 వ జయంతోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం నాడొక ప్రకటనలో తెలిపారు.
- షెడ్యూల్ కులాల నిరుద్యోగులకు గ్రూప్ 1,గ్రూప్ 2 ఫౌండేషన్ కోర్స్ కు ఉచిత కోచింగ్
- పత్రికా ప్రకటన సంగారెడ్డి, ఏప్రిల్ 05:– భారత జాతీ యావత్తు గర్వించదగ్గ వ్యక్తి డా. బాబు జగ్జీవన్ రామ్ విద్యతోనే ఆర్థిక, సామాజిక అసమానతలు తొలుగుతాయి చదువుతోనే తరాల అంతరాన్ని రూపుమాపవచ్చు తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది ….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యతోనే ఆర్థిక, సామాజిక అసమానతలు తొలిగి సమ సమాజం నిర్మితమవుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్ పి రమణ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్,అదనపు కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి ఆర్ అండ్ బి ఆఫీస్ పక్కన గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరంషెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత జాతీయావత్తు గర్వించదగ్గ మహ నీయుడు బాబు జగ్జీవన్ రామనీ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సమాజంలోని అసమానతల నిర్మూలనకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహనీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించి వారి స్ఫూర్తితో ఉన్నతంగా ఎదగాలన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలతో ప్రతి ఒక్కరు ప్రేరణ పొందాలని సూచించారు.విద్యతోనే ప్రతి వ్యక్తి దిశ దశ మారుతుందని, తరతరాల అంతరాన్ని పేదరికాన్ని పోగొడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో త్వరలోనే శిక్షణ కేంద్రం ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. వందమంది ఎస్సీ ,వంద మంది ఎస్టీలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని వసతులతో రెసిడెన్షియల్ భవనాన్ని వెతుకుతున్నామని, వీలైతే అంబేద్కర్ జయంతి నాడు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. యువత, విద్యార్థులకు జీవితంలో పైకి రావాలన్న పట్టుదల ఉండాలని, ఆ మేరకు లక్ష్యంతో సాధించాలని ఉద్భోదించారు. విద్యార్థులు చదువు పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తుందని, దళిత బంధు డబ్బులు ఇచ్చి వదిలివేయడం లేదని, లబ్ధిదారులు తమ రంగంలో విజయం సాధించేలా జిల్లా యంత్రాంగం వెన్నంటే ఉందన్నారు. రానున్న రోజుల్లో దళితులు అన్ని విధాలా సమానంగా ఎదుగుతారని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మరింత ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ కోరారు. జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సమాజ సేవ కోసం పుట్టిన నాయకుడని, ఆయన స్ఫూర్తితోనే నాటి పాత రోజుల్లో ఉన్న దళితులతో పోల్చితే నేటి దళిత కుటుంబాల లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. సమాజంలో మేము గొప్పగా బతకగలం అన్న ఆత్మస్థైర్యం వారిలో నిండుగా ఉందన్నారు. దళితుల శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయుల ఆశలు, ఆశయాలు నెరవేరుతున్నవని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను దళితుల కోసం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమాజానికి మంచి నాయకులను ఎన్నుకుని, నవ సమాజ నిర్మాణానికి భావితరాలు ముందుకు రావాలన్నారు. ముందుగా యువతలో మార్పు రావాలని , తమ బుద్ధికుశలత లతో దేశానికి ఉపయోగపడాలని, సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ఆచరించాలని, వారి స్ఫూర్తి మార్గదర్శకం కావాలన్నారు. అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ,డాక్టర్ అంబేద్కర్, బాపు పూలే లాంటి మహనీయులు దేశం కోసం, అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ తోనే తాను అందోల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎంపికైనట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేద ప్రజల్ని ,తన జాతి కోసం పరితపిస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తు.చ తప్పకుండా అమలుకు శ్రమించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. వారి ఆశయ కృషి కోసం ఎంత వరకు పని చేస్తున్నామన్నది మనకు మనం ప్రశ్నించుకోవలసిన అవశ్యకత ఉందన్నారు. ఈ తరం వారికి మహనీయుల జీవిత చరిత్రల గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని, అన్ని లైబ్రరీలలో వారి జీవిత చరిత్రలు ఉండేలా చూడాలన్నారు. దళితుల జీవితాల్లో అన్ని విధాల వెలుగులు తీసుకురావాలని మరింత వెనుకబడి ఉన్న వారిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని భావించిన ప్రభుత్వం దళిత బందు కు శ్రీకారం చుట్టిందన్నారు. దళిత బందు తో నేరుగా లబ్ధిదారునికి వంద శాతం సబ్సిడీ గా 10 లక్షల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఐదు లేదా ఆరు సంవత్సరాలలో వెనుకబడి ఉన్న దళితుల జీవితాల్లో మార్పు తీసుకురానుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం తో, మనతో పాటు మన జాతి పురోగతికి, అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జాతిని చైతన్యం చేసినప్పుడే ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా అన్ని విధాలా అభివృద్ధి చెందుతామన్నారు. దళితుల అభివృద్ధి చదువు తోనే ముడిపడి ఉందన్నారు. బాబు జగ్జీవన్ గారి ఆశయాలకు కృషి చేయాలని, వారు చూపిన మార్గంలో నడవాలని యువతకు సూచించారు. అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప వ్యక్తి ఉన్నత చదువులు చదవడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడ్డారని, ఆయనవల్లే సామాజిక న్యాయం సాధ్యమైందని కొనియాడారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటే సామాజికంగా న్యాయం చేకూరుతుందన్నారు. యువత విద్యార్థులు నిబద్ధతతో కూడిన జీవితాన్ని అలవర్చుకుని జీవితంలో విజయవంతంగా నిలబడాలన్నారు. భవిష్యత్తులో మంచి హోదాలో ఉన్నతంగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వివిధ కుల సంఘాల నాయకులు నాగయ్య, ఎస్. చంద్రయ్య, మాణిక్యం, అనంతయ్య, పోలీస్ రామచంద్రయ్య సామ్రాట్ గోవింద్, వైద్యనాథ్,బీరా యాదవ్ మల్లయ్య, శేఖర్ ,దర్శన్, నాగల్ గిద్ద జడ్పిటిసి రాజు, తదితర నాయకులు బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. పలువురు దళిత సంఘాల నాయకులు బాబు జగ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి కృషి చేయాలని, అదేవిధంగా జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ 365 రోజులు శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్ ను కోరారు. కార్యక్రమానికి ముందు సాంస్కృతిక సారథి కళాజాత బృందం బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర పై పాడిన పాటలు ఆహుతులను అలరించాయి. డప్పోళ్ళ రమేష్ రచించిన “సామాజిక దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్” పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ,ఎస్పి, జెడ్పి చైర్ పర్సన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ రాధికా రామణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,యువత, మహిళలు, వసతి గృహ అధికారులు, తదితరులు హాజరైనారు.
- స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సోమవారం జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓ లు, డీపీఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- ఈ నెల 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం నాడొక ప్రకటనలో తెలిపారు.
- నిరుద్యోగ యువత పట్టుదలతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగాలని సాధించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉద్బోధించారు.
- జిల్లా ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- ఆవిష్కరణలకు నిలయం ఐ ఐ టి హెచ్ నూతన ఆవిష్కరణల ఒరవడి సృష్టించాలి…. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్
- ప్రజావాణి ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి అధికారులు విధిగా హాజరవ్వాలి ….జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- ప్రతి పేద కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలి…… జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి …. అదనపు కలెక్టర్ వీరారెడ్డి
- దళిత బంధు పథకం తో ఆర్థికంగా ఎదగాలి ఎంపిక చేసుకున్న యూనిట్ మార్కెట్ స్థితిగతులను పరిశీలించాలి ఎంపిక చేసుకున్న యూనిట్ పై అవగాహన పెంపొందించుకోవాలి …… జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి …. అదనపు కలెక్టర్ వీరారెడ్డి
- జిలాకు చేరుకున్న ఆలిండియా సర్వీసెస్,మరియు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనతో పూర్తిస్థాయి అవగాహన….. అదనపు కలెక్టర్ రాజర్షి షా
- గ్రామీణ ఆవిష్కరణలు, స్టార్టప్ లకు టిఎస్ఐసి ఆర్థిక సహకారానికి దరఖాస్తుల ఆహ్వానం…… జిల్లా కలెక్టర్ హనుమంతరావు
- మన ఊరు మన బడి అమలుకు ఎంపికైన అన్ని ప్రభుత్వ పాఠశాలను పూర్తి సదుపాయాలు, హంగులతో తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు.
- కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు.
- పకడ్బందీగా మన ఊరు – మన బడి అమలు ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతాయి ఉమ్మడి జిల్లాలో ఈ నెల 9 నుండి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించాలి రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పెరగాలి ఒక్కో నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ శాఖను కేటాయించాలి పనులు నాణ్యతతో ఉండాలి …….. మంత్రి హరీష్ రావు
- సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి …… అదనపు కలెక్టర్ రాజర్షి షా
- జిల్లాలో ఈనెల 27 నుండి మార్చి1 వరకు పల్స్ పోలియో కార్యక్రమం పల్స్ పోలియో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి…..జిల్లా కలెక్టర్ హనుమంతరావు