DPRO ADB-అంబెడ్కర్ స్పూర్తితో యువత ముందుకు రావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ మహోన్నత వ్యక్తి, రాజ్యాంగ సృష్టికర్త వర్ధంతి సందర్బంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ 65 వ వర్ధంతి సందర్బంగా స్థానిక షెడ్యూల్డు కులాల అభివృద్ధి కార్యాలయ ఆవరణలో వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు. తొలుత అంబెడ్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం బాబు జగ్జివన్ రామ్, జ్యోతి బాపులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబెడ్కర్ అని, ప్రేరణ కల్పించే వ్యక్తి అని, మహా మేధావి అని కొనియాడారు. అంబెడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేస్తూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత నూతన ఒరవడిని సృష్టించాలని కోరారు. జిల్లాలోని ప్రజల తరపున ఆయన వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DSP వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, ఆయా సంఘాల నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post