అగ్రజ టౌన్ షిప్ లోని రాజీవ్ స్వగృహ లే అవుట్ ల ప్లాట్లను వేలంపాట ద్వారా సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. మంగళవారం రెండవ రోజున స్థానిక పి.జనార్దన్ రెడ్డి గార్డెన్ లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల ప్రత్యేక్ష వేలం పాటలో ఔత్సహికులు రెండవ రోజున పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధర గజానికి 8 వేల కంటే అత్యధికంగా పోటిపడి వేలం పాట పాడుతూ ప్లాట్లను కైవసం చేసుకుంటున్నారని అన్నారు. ప్లాట్లను సొంతం చేసుకున్న వారికి అలాట్ మెంట్ పత్రాలను అందించారు. మావల మండలం బట్టి సావర్గం శివారులోని బైపాస్ కు అనుకొని ఉన్న స్వగృహ ప్లాట్లను ప్రభుత్వం విక్రయిస్తుందని, ఔత్సహికుల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. తొలి రోజు అత్యధికంగా గజానికి రూ .17,100/- వేలం పాడారని తెలిపారు. ఈ రోజున గాజానికి రూ.18,400/- లతో వేలంపాటలో పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వేలం పాటలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటు సొంత ఇంటి స్థలం కొనుగోలు కళలను నిజం చేసుకోవలని కోరారు. ఈ కార్యక్రమంలో TSIIC జోనల్ మేనేజర్ మహేశ్వర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, పిడి హౌసింగ్ బసవేశ్వర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, తహశీల్దార్ సంధ్యారాణి, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఈ వేలంపాటలో సుమారు ఐదు వందల మంది కొనుగోలు దారులు, తదితరులు పాల్గొన్నారు.