అనధికార ఇంటిస్థలాలను క్రమబద్దీకరించేందుకు చేపట్టిన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం పట్టణం లోని పిట్టలవాడ, భాగ్యనగర్ లో రెవెన్యూ బృందాలు చేపట్టిన సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అనధికార ప్లాట్లను క్రమబద్దికరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.58, 59 ను జారీచేయడం జరిగిందన్నారు. ఇంటిస్థలాల క్రమబద్దీకరణకు ఇప్పటివరకు జిల్లాలో 1650 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ రోజు నుండి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఐదు బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన దరఖాస్తులను ఆన్ లైన్ యాప్ లో పొందుపర్చడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సర్వే బృందాలకు ఆన్ లైన్ యాప్ పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సర్వే బృందాలు దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించి సమన్వయంతో త్వరితగతిన సర్వేను పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే చేపట్టడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, ప్రత్యేక అధికారులు రవిశంకర్, తహసీల్దార్లు వనజ, శివరాజ్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- అనధికార ఇంటిస్థలాలను క్రమబద్దీకరించేందుకు చేపట్టిన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.