జిల్లా పరిపాలన అధికారుల సూచనలు పాటించకుండా భూముల రిజిస్ట్రేషన్ చేసిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం రోజున జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార రిజిస్ట్రేషన్ లపై విచారణ నిర్వహించారు. అనధికార లే అవుట్ లు, అసైన్డ్ భూములను కొన్ని ప్రాంతాల్లో జిల్లా పరిపాలన అధికారుల సూచనలను నిర్లక్ష్యం చేస్తూ, నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిన దృష్ట్యా విచారణ చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారి నరహరి, జిల్లా రిజిస్ట్రార్ అధికారి ఫణిందర్, సీనియర్ అసిస్టెంట్ కవిత, తదితర అధికారులను ఆయన విచారించారు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ లేనప్పటికీ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు ఆయన గ్రహించారు. ఈ విచారణలో ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- అనధికార భూముల రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు చేపడతాం- స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
You might also like:
-
DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.