DPRO ADB-అనధికార లే అవుట్ లు, భవన నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు-జిల్లా టాస్క్ ఫోర్స్ కన్వీనర్, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ భోజన్న.

నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాలు, లే అవుట్ లను చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా టాస్క్ ఫోర్స్ కన్వీనర్, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ భోజన్న తెలిపారు. పట్టణంలో అనధికార భవన నిర్మాణాలు, లే అవుట్ లపై ఫిర్యాదులు అందిన మేరకు గురువారం రోజున ద్వారకా నగర్ లోని రోడ్డును బ్లాక్ చేసిన ప్రాంతాలను జిల్లా టాస్క్ ఫోర్స్ పరిశీలించి సదరు నిర్మాణ దారుని భూమికి సంబందించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అట్టి పత్రాలను పరిశీలించిన పిదప చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా రాంపూర్ రోడ్ లో అనధికారికంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారని, అనుకుంట గ్రామపంచాయితీ ఖానాపూర్ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్ 17 లో అనధికార లే అవుట్ ఏర్పాటు చేసిన బండ రాయిలను వెంటనే తొలగించాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. అనధికార భవన నిర్మాణాలు చేపట్టినా, నాలా అనుమతి లేని అనధికార లే అవుట్ లను ఏర్పాటు చేసినా చట్ట ప్రకారం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవనాలను కూల్చివేయడం, లే అవుట్ లను తొలగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారులు సాయికిరణ్, అనురాధ, తదితరులు ఉన్నారు.

Share This Post