DPRO ADB-అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుంది- ఎమ్యెల్యే జోగు రామన్న

రాష్ట్రంలోని అన్ని మతాల పండుగలను సమానత్వంతో తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తున్నదని ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న అన్నారు. బుధవారం రోజున స్థానిక ఎస్టీయూ భవన్ లో ప్రభుత్వ పరంగా క్రిస్టిమస్ వేడుకలను నిర్వహించారు. ప్రేమ గౌరవంతో జీవించడమే ప్రధానమని, అన్ని మతాలను గౌరవించాలని అన్నారు. రెండు లక్షలతో ప్రభుత్వ పరంగా మంజూరుచేసి పేద వారికి గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్నామని తెలిపారు. కోటి రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. క్రిస్టిమస్ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిధి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ శుభాకాంక్షలు తెలుపుతూ, అన్నివర్గాల వారి పండుగలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ మాట్లాడుతూ, క్రిస్టిమస్ పండుగ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పంపిన క్రిస్టిమస్ పండుగ శుభాకాంక్షలను కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. అంతకు ముందు క్రిస్టిమస్ పండుగ సందర్బంగా కేక్ ను పిల్లల సమక్షంలో కట్ చేశారు. అనంతరం పేద క్రై స్తవ కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్ లను ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మునిసిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, స్థానిక నాయకులు, అధికారులు, పాస్టర్లు, క్రైస్తవులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post