కోవిడ్ వలన దిశ సమావేశాన్ని సకాలంలో నిర్వహించలేక పోయామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై సమావేశంలో చర్చించుకొని అర్హులైన వారందరికీ దరి చేరేలా ప్రణాళికలు చేపట్టాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్ సోయం బాపూరావు అన్నారు. శుక్రవారం రోజున జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం వర్చువల్ విధానం ద్వారా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ, జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవతంగా అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలనీ అన్నారు. వ్యవసాయం, వైద్యం, రెండు పడక గదుల ఇళ్ళు, స్త్రీ శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, విద్యుత్, మైనింగ్, రిమ్స్, రైల్వే, పౌర సరఫరాలు, తదితర శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. జిల్లాలో భూసార పరిక్షలు ఎక్కువగా నిర్వహించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని అన్నారు. 1025 భూసార పరీక్షలు మాత్రమే నిర్వహించారని, మరిన్ని పరీక్షలు నిర్వహించి రైతులకు పంటల సాగుకు సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలనీ అన్నారు. కోవిడ్ సమయంలో చిన్నారులకు, బాలింతలకు, గర్భవతులకు పౌష్టికాహారం పంపిణి నిర్వహించాలని అన్నారు. ఇచ్చోడ మండలం ఆడేగావ్ గ్రామంలో అనధికార లే అవుట్ లను తొలగించాలని అన్నారు. నిరుపేదలకు ఉజ్వల పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేయాలనీ అన్నారు. జిల్లాలో రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా దిశ కమిటీ సమావేశానికి అంతరాయం కలిగిందని, ఇక ముందు సకాలంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో జరుగుచున్న వివిధ పనులపై ఆయా శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులు, సభ్యులు చర్చించడం జరిగిందని, వచ్చే సమావేశం నాటికీ ఈ సమావేశం లో చర్చించిన అంశాలకు సంబందించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పిస్తామని పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ నియామక ప్రాసెస్ ను ఈ టెండర్ విధానం ద్వారా నిర్వహించడం జరిగిందని తెలిపారు. షెడ్యూల్డు కులాలు, తేగల పేద వర్గాల ప్రజలకు 101 యూనిట్ ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్న చర్చలో ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం నిధులు అందిస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ లకు కుల ధ్రువీకరణ పత్రాలు సంబంధిత తహసీల్దార్లు అందించే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవడానికి కోరతామని అన్నారు. పేదలు, ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలకు అవసరమైన ఇసుక సమకూర్చేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుందామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, రైతుల భూముల్లో భూసార పరీక్షలు పెంచేందుకు వచ్చే సంవత్సరం ఎక్కువ లక్ష్యాలను చేపట్టే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు విద్యుత్ సబ్సిడీ కోసం అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. అనధికార లే అవుట్ లను క్రమబద్దీకరిస్తూ రిజిస్ట్రేషన్ లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ నియామకాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టడం జరిగిందని తెలిపారు. దిశ కమిటీ సభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ, భూసార పరీక్షలు నిర్వహించి నివేదికల కార్డులు రైతులకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే నిధుల ద్వారా గిరిజన ప్రాంతాల్లోని రోగులకు రవాణా సౌక్యారం కల్పించాలని కోరారు. 2015 -16 సంవత్సరంలో పరిపాలన అనుమతులు పొంది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తీ చేయలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ కు 80 వేల మంది జిల్లాలో అర్హత కలిగి ఉన్నారని వారందరికీ కుల ధ్రువీకరణ పత్రం అందించాలని కోరారు. అనధికారికంగా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై సమావేశంలో వివరించారు. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్, RWS ఎస్ఈ వెంకటేశ్వర్లు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB-అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలి- ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు.
You might also like:
-
ITDA UTNOOR: గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
-
DPROADB- ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB- అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పి.ఎస్.
-
DPRO ADB: పట్టణ ప్రజలు తమ ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.