భూముల సమస్యలు మీసేవ కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్ లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వివిధ సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి దరఖాస్తులు స్వీకరించారు. భూసమస్యలు, ఉపాధి కల్పన, వితంతువులకు ఉపాధి అవకాశాలు, కారుణ్య నియామకాలు, తదితర అంశాలకు సంబంధించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూములకు సంబంధించిన సమస్యలను ధరణి పోర్టల్ లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలానికి చెందిన వితంతువు లక్ష్మి తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. షెడ్యూల్డు కులానికి చెందిన అంపల్లి జ్యోతి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యానని, ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరారు. కారుణ్య నియామకాలకు సంబంధించిన వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రైకార్ రుణాలకు బ్యాంకు అధికారులు సంబంధిత అధికారుల నుండి ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ నిబంధనల కారణంగా ప్రజావాణి నిర్వహించలేక పోయినప్పటికీ వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులు నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామని పేర్కొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB-ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ విజయవంతం చేయాలి, వచ్చే వర్షాకాలం నాటికి పారిశుధ్య కార్యక్రమాలు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADILABAD: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు కష్టపడి చదివి విజయం సాధించాలి – జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
-
DPRO ADILABAD: పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి – జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
-
DPRO ADB- క్రమబద్దీకరణ సర్వేను వేగవంతం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.