DPRO ADB -అర్హులైన వారికీ టీకా మందు అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అర్హులైన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున పట్టణంలోని శాంతినగర్ కాలనీలో పర్యటించి వ్యాక్సిన్ అందిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన వారిని ఇంటింటికి తీరిగి గుర్తించి వ్యాక్సిన్ అందించాలని అన్నారు. ఏ ఒక్కరు కూడా మిగిలి పోకుండా కాలనీలు, వార్డులలో టీమ్ లు పర్యటించి టీకా పంపిణి కార్యక్రమాన్ని వందశాతం నిర్వహించాలని అన్నారు. వార్డులకు కేటాయించిన ప్రత్యేక అధికారులు మున్సిపల్, వైద్య శాఖల సిబ్బందిని సమన్వయ పరుస్తూ వ్యాక్సిన్ పంపిణి జరగాలని అన్నారు. నిర్లక్ష్యం వహించిన ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్న వారిని గుర్తించి వారికీ గడువు సమయానికి రెండవ డోస్ అందించాలని అన్నారు. కాలనీలలో ఉదయం పూట టీమ్ లు వెళ్లడం వలన ఇళ్లలోని అర్హులైన వారిని గుర్తించ వచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శైలజ, వార్డ్ ప్రత్యేక అధికారి, సీడీపీఓ వనజ, మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా, తదితరులు పాల్గొన్నారు.

Share This Post