DPRO ADB- ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఎలక్టోరోల్ పరిశీలకులు, ERO లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎలక్టోరోల్ పరిశీలకులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి ఆక్షేపణలు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేసి ప్రచురించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 582 పోలింగ్ కేంద్రాలలో 4,25,042 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎందులో 2,09,071 పురుషులు, 2,15,961 మంది స్త్రీలు, 10 ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నియోజక వర్గంలో 281 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,27,583 మంది ఓటర్లు కాగా 1,12,271 మంది పురుషులు, 1,15,305 మంది స్త్రీలు, ఏడుగురు ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. బోథ్ నియోజక వర్గంలో 301 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,97,459 మంది ఓటర్లు కాగా 96,800 మంది పురుషులు, 1,00,656 మంది స్త్రీలు, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 225 , బోథ్ నియోజకవర్గంలో 509 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 582 పోలింగ్ కేంద్రాల పరిధిలో 7281 ఆక్షేపణలు, 3178 అభ్యంతరాలు రాగా వాటిని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా 582 పోలింగ్ కేంద్రాలలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో బోథ్ నియోజకవర్గ ERO, ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఆదిలాబాద్ నియోజకవర్గం ERO, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా పాల్గొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 140 లో బూత్ స్థాయి అధికారి పార్వతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హన్మంత్ రావు, బోథ్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 230 లో బూత్ స్థాయి అధికారులు ఆయా కేంద్రాలలో ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించారు.

Share This Post