DPRO ADB – ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల జయంతి వేడుకలు

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం వికలాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా దివ్యంగులకు సహకారం అందిస్తామని తెలిపారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులైనటువంటి పిల్లలతో కేక్ కట్ చేసి, ఆట పాటల నడుమ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు జరిగాయి. అదే విధంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, ఎంపీడీఓ రమాకాంత్, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post