DPRO ADB- ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటింటి ఆరోగ్యం సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక శాంతినగర్ కాలనీలోని 32, 33 వార్డులలో సర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి నుండి ఇంటింటి ఆరోగ్యం సర్వే లో భాగంగా ఆ ఇంటి లోని వ్యక్తులకు జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్య, మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు 25 ఇండ్ల చొప్పున ఒక్కొక్క టీమ్ లు సర్వే చేయవలసి ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో 114 టీమ్ లు, గ్రామీణ ప్రాంతంలో ప్రతి హాబిటేషన్ కు ఒక టీమ్ ను ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నామని తెలిపారు. సర్వే చేసే సమయంలో ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే వారికీ అవసరమైన మందుల కిట్లను అందించడం, కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఐసోలేషన్ ఉన్నవారు ఐదు రోజుల పాటు ప్రభుత్వం రికమండ్ చేసిన మందులను తీసుకోవాలని తెలిపారు. రోజురోజుకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఆయా వార్డులోని పలు కాలనీ వాసులతో కలెక్టర్ స్వయంగా ముచ్చటించి వారి ఆరోగ్య విషయాలను, వ్యాక్సినేషన్ విషయాలను తెలుసుకున్నారు. ఈ ఆరోగ్య సర్వే తో పాటు ఆయా కుటుంబాల్లో మొదటి, రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు, 15 -18 సంవత్సరాల వయసు గల పిల్లలు, 60 యేండ్ల పై బడిన వారి వివరాలు సేకరిస్తూ, ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకొని వారికీ మొదటి డోస్ ఇప్పించడం, రెండవ డోస్ అర్హత గల వారికీ ఇవ్వడం, 15-18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్, 60 యేండ్ల పై బడిన వారికీ బూస్టర్ డోస్ ఇచ్చేనందుకు ఆయా వార్డులలో మెడికల్ టీమ్ లు కూడా పర్యటిస్తున్నాయని తెలిపారు. ప్రజలందరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకొని వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమీషనర్ శైలజ, వార్డ్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, తదితరులు పాల్గొన్నారు.

Share This Post