DPRO ADB- ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇంటింటి ఆరోగ్యం సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం రోజున రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో బి.ఆర్.కే. భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, పంచాయితీ, మున్సిపల్ అధికారులతో కోవిడ్ నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కోవిడ్ పాజిటివ్ సంఖ్య పెరుగుచున్నదని, వాటిని అరికట్టేందుకు గతంలో నిర్వహించిన ఫీవర్ సర్వే ద్వారా వైరస్ వ్యాప్తిని అదుపు చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నీతి ఆయోగ్ అభినందించడం జరిగిందని తెలిపారు. పంచాయితీ రాజ్, మున్సిపల్, మెడికల్ భాగస్వామ్యంతో ఈ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ మొదటి డోస్ వందశాతం అందించామని, రెండవ డోస్ 77 శాతం అందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రెండవ డోస్ వందశాతం సాధించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో పని చేయాలనీ అన్నారు. 15-17 సంవత్సరాల వయసు గల పిల్లలకు వందశాతం వ్యాక్సిన్ అందించాలని అన్నారు. 60 యేండ్లు నిండిన వారు, ఫ్రంట్ లైన్ వర్కర్ లకు బూస్టర్ డోస్ అందించాలని అన్నారు. ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ టెస్ట్ లు నిర్వహించాలని అన్నారు. ఓమైక్రాన్ వేరియంట్ ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాల్లో మందుల కొరత లేదని అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లక్షణాలు కలిగిన వారందరికీ పరీక్షలు నిర్వహించి కిట్లను అందజేసి హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా చూడాలని అన్నారు. ప్రతి రోజు వారి ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే మందుల పని తీరు బాగుందని అన్నారు. ఆక్సిజన్, ఐసీయూ వార్డ్ లు సిద్ధం చేయాలనీ, కోవిడ్ వార్డ్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించే విధంగా భౌతిక దూరం పాటించే విధంగా విస్తృత అవగాహన, ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఒకే చోట ప్రజలు గుమిగూడకుండా చూడాలని అన్నారు. ఇంటింటి ఆరోగ్యం టీమ్ లో గ్రామీణ ప్రాంతంలో వైద్య సిబ్బంది, పంచాయితీ సిబ్బంది ఉండాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్, వైద్య సిబ్బంది ఉండాలని సూచించారు. గర్భిణీలకు పాజిటివ్ రావడంతో జిల్లా, గాంధీ ఆసుపత్రులకు పంపిస్తున్నారని, పాజిటివ్ కలిగిన గర్భిణీలకు ప్రత్యేక చికిత్సలు అందించాలని వైద్యులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఇంటింటి సర్వే విజయవంతం అయ్యిందని, కోవిడ్ వైరస్ సోకినా వారికీ ఇస్తున్న కిట్ లు చాలా బాగా పనిచేస్తున్నాయని అన్నారు. రోగులతో టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి నోడల్ అధికారులను నియమించి కరోనా కట్టడి చేయాలనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డులకు మాస్టర్ టీమ్ లను ఏర్పాటు చేయాలనీ, జ్వరం, చలి, దగ్గు వంటి లక్షణాలు కలిగిన వారికీ మెడికల్ కిట్ అందించి ఐదు రోజులు వాడే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే నిర్వహించి ప్రతి రోజు నివేదికలు సమర్పించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవుట్ పేషంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని అన్నారు. రెండవ డోస్ వందశాతం సాధించాలని అన్నారు. కరోనా వలన మరణించిన కుటుంబ వారసులకు ఎక్స్ గ్రేషియా అందించడానికి సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనీ అన్నారు. DME రమేష్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలకు వివిధ రుగ్మతలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని అనుభవజ్ఞులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో పిల్లల కేసులు ఎక్కువగా వస్తే వాట్సాప్ ద్వారా తెలియజేయాలని అన్నారు. DMA సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇస్తున్న మందులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, గతంలో ఇంటింటి సర్వేని పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని, టీమ్ లను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి టీమ్ రోజుకు 25 ఇండ్ల చొప్పున సర్వే చేసే విధంగా ఏర్పాటు చేసే విధంగా తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొదటి డోస్ 99.71 శాతం, రెండవ డోస్ 85 శాతం, ప్రికాషనరీ డోస్ 70 శాతం, 15-18 సంవత్సరాల పిల్లలకు 62 శాతం టీకా పంపిణి జరిగిందని తెలిపారు. వందశాతం వ్యాక్సిన్ అందించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో కోవిడ్ ద్వారా మరణించిన కుటుంబాల వారికీ ఎక్స్ గ్రేషియా అందించేందుకు మీ సేవ ద్వారా 270 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 134 దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, మిగితావి రెండు రోజుల్లో పరిశీలించి సమర్పిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.శ్రీకాంత్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, మున్సిపల్ ఈఈ వెంకట శేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post