DPRO ADB- ఈ – హాస్టల్ అంతర్జాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఈ- హాస్టల్ అంతర్జాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున స్థానిక నలంద కళాశాలలో షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని షెడ్యూల్డు కులాల వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఈ- హాస్టల్ అంతర్జాలం పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని వసతి గృహాల సంక్షేమాధికారులకు ఆన్ లైన్ విధానం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి అంశం, ప్రతి మాడ్యూల్ తప్పనిసరిగా శిక్షణ పొందాలని తద్వారా వసతి గృహాల నిర్వహణ, విద్యార్థులు హాజరు, తదితర అంశాలకు సంబంధించి పూర్తీ సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారానే నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. ఎస్సీ విద్యార్థులను హాస్టల్ లో చేర్పించాలని సూచించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాన్ని అందించామని పేర్కొన్నారు. జిల్లాలో పని చేస్తున్న సంక్షేమ అధికారులకు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారులుగా నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయ ఉప సంచాలకులు కె.కిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, ప్రాజెక్టు మేనేజర్ శివ వాణి, సహాయ సంక్షేమ అధికారులు నారాయణ్ రెడ్డి, కే.నర్సింగ్, నలంద కళాశాల చైర్మన్ డి.కిష్టు, సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు జి.పూర్ణచందర్, ఉమ్మడి జిల్లాలోని వసతి గృహాల సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post