ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పని ప్రదేశాలలో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున ఇచ్చోడ మండలం సాథ్ నంబర్ గావ్ గ్రామపంచాయితీ పరిధిలోకి ఇస్లాంనగర్ హాబిటేషన్ లో చేపడుతున్న ఉపాధి హామీ కూలీ పనులను, నర్సరీని, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీలతో మాట్లాడుతూ, కూలీలు చేపడుతున్న పనులు, వసతి సౌకర్యలు, కూలీ సొమ్ము, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, ఏప్రిల్, మే నెల మాసాలలో కూలీలకు ఉపాధి హామీ పనులను ఎక్కువగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. పని ప్రదేశాలలో కూలీలకు త్రాగునీరు, నీడ, తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కూలీలకు మరింత పనులు కల్పించ వచ్చని, ఇచ్చోడ మండలంలో సరాసరి 113 మంది కూలీలు పని చేస్తున్నారని, మరింత ఎక్కువ మందికి పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జూన్ మాసంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్న దృష్ట్యా నర్సరీలలో ఎక్కువ మొక్కలు పెంచాలని అన్నారు. ఇస్లాం నగర్ నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించి మొక్కలకు సంబంధించి బోర్డులను ఏర్పాటు చేసి మొక్కల సంఖ్యను నమోదు చేయాలనీ అన్నారు. జామ, నిమ్మ, సీతాఫల్, కరివేపాకు, చామంతి, చింత, తదితర డిమాండ్ మేరకు మొక్కలను పెంచుతున్నామని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఇలాయిచి, అంజీర్ మొక్కలను కూడా పెంచుతున్నామని కలెక్టర్ కు తెలిపారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపడుతున్న పనులపై సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎంపీడీఓ రామ్ ప్రసాద్, సర్పంచ్ షేక్ అమీనా బీ, ఎంపీటీసీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- ఉపాధి కూలీలా సంఖ్య పెంచాలని, నర్సరీలలో పెంచుతున్న మొక్కలకు బోర్డులను ఏర్పాటు చేయాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPROADB-ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB-ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB-రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB-స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలి- జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు