DPRO ADB- ఉపాధి హామీ పథకం సుపరిపాలన దిశగా రికార్డు ల పరిశీలన- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉపాధి హామీ పథకంలో సుపరిపాలన అందించేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున బేల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ రికార్డు లను కలెక్టర్, అదనపు కలెక్టర్ లు పరిశీలించారు. గుడ్ గవర్నెన్స్ క్రింద ఉపాధి హామీ పథకం పనులకు సంబందించిన రికార్డు పరిశీలన చేయడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న పనులకు సంబందించిన రికార్డు లను సిద్ధం చేయాలనీ, ప్రతి పనికి సంబంధించి ఉపాధి హామీ నిబంధనల మేరకు రికార్డు ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డుల తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పనులకు సంబందించిన రికార్డు లపై సంబంధిత అధికారుల సంతకాలు, కూలీల వివరాలు, మస్టర్, ఎస్టిమేట్స్ , తదితర వివరాల రికార్డు లను తనిఖీ లో పరిశీలిస్తామని అన్నారు. ఉపాధి హామీ పనులపై క్షేత్ర పర్యటన కూడా నిర్వహిస్తామని అన్నారు. ఈ పథకంలో అవకతవకలు జరుగకుండా పారదర్శకంగా జరిగే విధంగా క్షేత్ర అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, ఎంపీడీఓ రవీందర్, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు, EGS సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post