DPRO ADB- ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉపాధ్యాయ అర్హత పరీక్షను (TET) పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 12 న టెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన బోధనేతర సిబ్బందిని నియమించాలని, పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, పారిశుధ్య కార్యక్రమాలు ముందస్తుగా నిర్వహించాలని, అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ టీవీ లు ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఈ నెల 12 న ఉదయం గం. 9.30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం గం. 2.30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్ లలో టెట్ పరీక్షను నిర్వహించనున్నామని, మొదటి పేపర్ కు 7732 మంది అభ్యర్థులు, రెండవ పేపర్ కు 3166 మంది అభ్యర్థులు అర్హత పరీక్ష రణ్యనున్నారని తెలిపారు. పరీక్షలు సాఫీగా జరిగేందుకు ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో 10 మంది ఇన్విజిలేటర్ లు, హాల్ సూపరింటెండెంట్ లు, చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ అధికారులు నియమించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు అదనపు కలెక్టర్ ను సమన్వయ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుండి వచ్చే మెటీరియల్ ను ఆయా కేంద్రాలలో బందోబస్తు తో నిల్వచేయాలని అన్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు సకాలం లో చేరుకునే విధంగా గ్రామాల నుండి ముందస్తు సమయంలో బస్సులను రీ షెడ్యూల్ చేయాలనీ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో ప్రాథమిక చికిత్సలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు. పరీక్ష నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్ష కోసం నియమించే ఇన్విజిలేటర్లకు, హాల్ సూపరింటెండెంట్ లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డు లను జారీ చేయాలనీ అన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్ ల డౌన్లోడ్ లో ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు సహకరించాలని అన్నారు. ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్ సరఫరాకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని ప్రతి కేంద్రంలో పది గదులను అర్హత పరీక్ష రాసేందుకు కెటాయించాలని అన్నారు. అభ్యర్థులు టెట్ పరీక్ష రాసేందుకు సీటింగ్ ఆరెంజ్ మెంట్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post