DPRO ADB-ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించాలి- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

స్థానిక సంస్థల శాసన మండలి లెక్కింపు సజావుగా, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున స్థానిక సంస్థల శాసన మండలి లెక్కింపు సందర్బంగా స్థానిక టీటీడీసీలో కౌంటింగ్ సిబ్బందికి మలివిడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, కమిషన్ నియమావళి ప్రకారంగా ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఈ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. మొత్తం ఐదు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి టేబుల్ కు ఒక సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ సహాయకులను నియమిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ఉదయం గం. 6.30 ని. లకు హాజరు కావాలని తెలిపారు. ప్రతి టేబుల్ కు ప్రతి అభ్యర్థికి ఒకరు చొప్పున ఏజెంట్ లను నియమించుకోవలసి ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, ఏదైనా సమస్య వచ్చినపుడు రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ లెక్కింపు సిబ్బందికి బ్యాలెట్ పేపర్ ల లెక్కింపు వివరాలపై వివరించారు.ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, కౌంటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post