DPRO ADB- ఎన్నికల సమాచారం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శాసన మండలి ఎన్నికల సందర్బంగా ఎలాంటి సమాచారమైన కంట్రోల్ రూమ్ నంబర్ 1800-425-1939 కు కాల్ చేసి సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు, ఎన్నికల సిబ్బంది, ఎవరైనను రేపు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

Share This Post