DPRO ADB – ఎఫ్.ఆర్.సి. సమక్షంలో క్లెయిమ్ ఫారాలను స్వీకరించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అటవీ హక్కుల కమిటీల సమక్షంలో క్లెయిమ్ ఫారాలను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున ఇచ్చోడ మండలం దుబార్ పేట్, బోథ్ మండలం పిప్పల ధరి గ్రామాలలో క్లెయిమ్ ఫారాల స్వీకరణ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామాలలో స్వీకరిస్తున్న క్లెయిమ్ ఫారాల తీరును పంచాయితీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్జీదారునికి రశీదును అందించాలని, అలాగే ప్రతి దరఖాస్తు పై క్రమసంఖ్య ను కేటాయించి రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు. క్లెయిమ్ ఫారాలకు కుల, రేషన్ కార్డు, తదితర ఆధారాల ధ్రువీకరణ పత్రాలను జతచేసి విధంగా దరఖాస్తు దారునికి తెలియపరచాలని అన్నారు. గ్రామపంచాయితీ టీమ్ లు ఎఫ్.ఆర్.సి. కమిటీలకు సహకరించాలని అన్నారు. అన్ని రిజిస్టర్ లను తప్పని సరిగా నిర్వహించాలని అన్నారు. ఎఫ్.ఆర్.సి. కమిటీ ఏర్పాటు సమాచారాన్ని గ్రామసభలో చర్చించిన తీర్మానాలను రిజిస్టర్ లలో నమోదు చేయాలనీ అన్నారు. ఈ సమావేశాలలో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, FDO బర్నోడా, తహసీల్దార్లు అతికొద్దిన్, శివ రాజ్, ఎంపీడీఓ లు రామ్ ప్రసాద్, రాధ, ఎంపీఓ లు, పంచాయితీ కార్యదర్శులు, అటవీ అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post