ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు విధులు నిర్వహించాలని, సమయానుకూలంగా నివేదికలు సమర్పించాలని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వే టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల నేపథ్యం లో వివిధ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా టీమ్ లు ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఏరోజుకారోజు నిర్ణిత సమయంలో నివేదికలను సమర్పించాలని అన్నారు. ప్రతి టీమ్ అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశం లో కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎంపీడీఓలు, పోలీస్, ఎక్సయిజ్, వివిధ శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన టీమ్ లు, ఈ శిక్షణలో పాల్గొన్నారు.