DPRO ADB- ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కరించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

షెడ్యూల్డు కులాలు, తెగలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా నియమించిన కమిటీ సభ్యుల పరిచయాలను నిర్వహించారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ సందర్బంగా సకాలంలో సమావేశాలు నిర్వహించలేక పోయామని, ఎస్సీ, ఎస్టీలకు సంబందించిన సమస్యలను ఏ సమయంలో నైనను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. అధికారుల నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన విచారణను పోలీస్ అధికారులు త్వరితగతిన చేపట్టాలని, సకాలంలో పరిహారం అందించాలని, రెవెన్యూ, పోలీస్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. 2020 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 25 కేసులు నమోదు కాగా, 5 కేసులు ఫైనల్ రిపోర్ట్ రావడం జరిగిందని మరో 20 కేసులు పెండింగ్ ట్రయిల్ లో ఉన్నాయని తెలిపారు. 2021 సంవత్సరంలో 33 కేసులు నమోదు కాగా, 3 కేసుల పూర్తీ నివేదికలు అందాయని, 23 కేసులు పెండింగ్ ట్రయిల్ లో ఉన్నాయని, 7 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి సంబంధించిన వాటిని అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సమస్యలను పోలీస్ ల దృష్టికి తీసుకురావాలని, విచారణ సమయంలో సహకరించాలని, ఇప్పటివరకు ఉన్న కేసుల్లో సుమారు 80 నుండి 90 శాతం వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. న్యాయ పరంగా దళితులకు సహకారం అందిస్తామని అన్నారు. ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్ మాట్లాడుతూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, DSP స్థాయి అధికారులు విచారణ జరుపుతారని అన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దంగా దళితులకు రక్షణ కల్పించడం జరుగుతుందని, చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం కేసులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ చట్టం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కమిటీ సభ్యులు ఎస్సీ, ఎస్టీ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. 2020 కన్నా 2021 సంవత్సరంలో కేసుల సంఖ్యా పెరిగాయని అన్నారు. ASP హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సభ్యులకు అందుబాటులో ఉంటామని, ఏ సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. కమిటీ సభ్యులు పలు సమస్యలపై కమిటీలో తెలిపారు. అంతకు ముందు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబందించిన వివరాలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, DSP వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, అధికారులు, సభ్యులు కాంబ్లే బాబ్ సాహెబ్, ఎల్.రోష్ణ, గెడం సుమన్ బాయి, ఎం.అనిల్, మెస్రం భీం రావు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post