DPRO ADB -ఏజెన్సీ ఏరియా లో నైట్ వ్యాక్సినేషన్ నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఏజెన్సీ ఏరియా లో ని గ్రామాలలో నైట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఐటిడిఎ ఉట్నూర్ పి ఓ కార్యాలయ సమావేశ మందిరంలో లో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల మెడికల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓ లతో వ్యాక్సినేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సి ఎస్ వారి ఆదేశాల ప్రకారం ఏజెన్సీ ఏరియా లోని గ్రామాలలో నైట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. ఈనెల మాసాంతానికి 100% వ్యాక్సిన్ దిశగా లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. థర్డ్ వేవ్ దృష్ట్యా కరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి పాటించాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి మోటివేట్ చేయాలని, వెంటవెంటనే ఆన్లైన్లో లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఆయా మండల మెడికల్ ఆఫీసర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎం పి ఓ లు పాల్గొన్నారు.

Share This Post