DPRO ADB – ఐదుగురు అభ్యర్థుల నామినేషన్ ల ఉప సంహరణ- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ నామినేషన్ లను ఐదుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎమ్యెల్సీ నామినేషన్ ల ఉప సంహరణ సందర్బంగా గురువారం రోజున ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్ లను ఉప సంహరించుకుంటున్నట్లు నిర్ణిత ఫారం లో సమర్పించగా వాటిని ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన యం.డి.రియాజ్ ఉద్దీన్, నిర్మల్ జిల్లా భైంసా మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రజాక్, కడెం మండలం నచ్చన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కట్ట శ్యామ్ సుందర్, భైంసా మండలం ఎగ్జావ్ గ్రామానికి చెందిన గాజుల గంగాధర్ లు స్వయంగా నామినేషన్ లను ఉప సంహరించుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన గుండవరపు హరిణి తన ప్రతిపాదకుడు ఎస్.సాయి కృష్ణ గౌడ్ ద్వారా తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post