DPRO ADB- కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బతుకమ్మ పండుగను సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న మహిళల లందరు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆట లో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కార్యాలయం మహిళా సిబ్బంది కలెక్టర్ కు బతుకమ్మ ను నెత్తిన పెట్టి స్వాగతం పలికారు. బతుకమ్మలను హారతి తో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలపై సాంప్రదాయ బద్దంగా ఆడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శనివారం రోజున మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్ మాసం లో భాగంగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో 2.60 లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ జరుగుతున్నదని తెలిపారు. జిల్లా ప్రజలకు బతుకమ్మ వేడుకల సందర్బంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉద్యోగులతో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, డిపిఆర్ఓ, పర్యవేక్షకులు, తదితరులు బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మహిళా ఉద్యోగులతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దంపతులు డాక్టర్ షేక్ అమ్రీన్ -రిజ్వాన్ బాషా, ఆర్డీఓ రమేష్ రాథోడ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్ కుమార్, డిపిఆర్ఓ ఎన్.భీమ్ కుమార్, సంక్షేమ శాఖల మహిళా అధికారులు మిల్కా, కృష్ణవేణి, సునీతకుమారి, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post