పంట భూములకు త్వరితగతిన సాగు నీరు అందించేందుకు కాలువ పనులకు అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాంద -టి గ్రామపరిధిలోని చనాకా- కోరాట కాలువ నిర్మాణ పనులను, వయో డక్ట్ బ్రిడ్జి నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. చనాకా- కోరాట బ్యారేజి గుండా చేపడుతున్న కాలువ పనులలో భాగంగా డి-14 నుండి డి-19 వరకు గల కాలువ పనులకు అవసరమైన భూ సేకరణ, లోయర్ పెన్ గంగా నిర్మాణ పనులపై నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో తెలుసుకున్నారు. సుమారు ఈ కాలువ పనులకు 600 ఎకరాల భూమి అవసరం ఉందని ఆయా రైతులతో చర్చించి భూ సేకరణ చేపట్ట వలసి ఉందని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కు తెలిపారు. డి-16ఏ వద్ద చేపట్టనున్న మైక్రో ఇరిగేషన్ పనుల పై కలెక్టర్ కు వివరిస్తూ బ్యారేజి క్రింద సాగు అయ్యే భూమిలో పదవ వంతు మైక్రో ఇరిగేషన్ చేపట్టవలసి ఉన్నదని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కాలువ,ఉప కాలువ, పిల్ల కాలువలకు అవసరమైన భూమి ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనల మేరకు భూ సేకరణ చేపట్ట వలసి ఉన్నదని తెలిపారు. 1.675 కిలో మీటర్ల మేర నిర్మించిన వయో డక్ట్ బ్రిడ్జి నిర్మాణ పనులు, కాలపరిమితి, వ్యయాలపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.పి.రాము, ఈఈ రవీందర్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB – కాలువ పనులకు అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.