DPRO ADB- కృషియల్ సంక్షేమ నిధులు సకాలంలో వినియోగించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

దళితుల కమ్యూనిటీ హాల్ ల నిర్మాణాలకు అవసరమైన భూములు కేటాయించాలని, కృషియల్ సంక్షేమ నిధులు సకాలంలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కృషియల్ సంక్షేమ నిధి పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ పనులకు గాను సుమారు 29.98 లక్షల రూపాయలు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని, అట్టి పనులను వెంటనే పూర్తిచేసి ఫొటోగ్రఫీ లను సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి 35 లక్షల రూపాయల నిధులు కృషియల్ సంక్షేమ నిధి కింద జిల్లాకు కేటాయించడం జరిగిందని, అట్టి నిధులతో పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, తదితర పనులు చేపట్టి నిధులను వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, పనులకు సంబంధించిన పురోగతిని పరిశీలిస్తామని, ఫొటోగ్రఫీ లను సమర్పించాలని అన్నారు. అంతకుముందు ఈ నిధులకు సంబంధించిన వివరాలను ఎస్సీ సంక్షేమ అధికారి సునీత వివరించారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఆర్డీఓ రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, EWIDC ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post