DPRO ADB-కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శ ప్రాయుడు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుడు, క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మంగళవారం రోజున స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ లో 107 జయంతి వేడుక సందర్బంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా వాసి బాపూజీ క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని, తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొన్న పోరాటయోధుడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 27 న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, 107 వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మహోన్నత వ్యక్తి అని క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి అని, ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని వాంకిడి గ్రామానికి చెందిన బాపూజీ సేవలను కలెక్టర్ కొనియాడారు. బాపూజీ ఆదర్శప్రాయుడని అన్నారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగు, వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post