DPRO ADB- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగోబా జాతరను నిర్వహించుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 31 న కేస్లాపూర్ నాగోబా మహా పూజతో జాతర ప్రారంభం కానున్న దృష్ట్యా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ దర్బార్ హాల్ లో జాతర ఏర్పాట్లపై ITDA ప్రాజెక్టు అధికారితో కలిసి అధికారులతో సమీక్షించారు. ముందుగా నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ జాతరకు వివిధ జిల్లాల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు జాతరకు వచ్చి దర్శించుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం నిరంతరం జరగాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. వీధి లైట్లు, హైమాస్ లైట్ లను ఏర్పాట్లు చేయాలని అన్నారు. కోవిడ్ కు సంబంధించిన నిబంధనలను ప్రతి పది నిమిషాలకు ఒకసారి మైక్ ల ద్వారా భక్తులకు తెలియపరచి మాస్క్ ధరించుకునే విధంగా, భౌతిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. జాతరలో వివిధ కూడళ్లలో శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని వైద్య అధికారులకు సూచించారు. వైద్య శాఖ ద్వారా గత సంవత్సరం చేపట్టిన విధంగానే ఆక్సిజన్ బెడ్ లు, 104, 108 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచి నిరంతర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించాలని అన్నారు. నీటి సరఫరా సక్రమంగా జరిగే విధంగా, మరుగుదొడ్లు అవసరమైన మేరకు ఏర్పాట్లు చేయాలనీ RWS అధికారులను ఆదేశించారు. భక్తులు నాగదేవతను దర్శించుకునే విధంగా పోలీస్ ల సహకారంతో బారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మర్రి చెట్టు ప్రాంతం, గోవాడ, దేవాలయ ప్రాంగణ సమీపంలోని మట్టిని చదును చేయాలనీ, ఇతర ఇంజనీరింగ్ పనులు దేవాలయ కమిటీ సూచించిన మేరకు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, విద్యుత్ శాఖ అధికారులని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన సాంప్రదాయ పూజ కార్యక్రమాలకు అవసరమైన పూజ సామాగ్రి, విద్యుద్దీకరణ, పూలమాల అలంకరణలు, తదితర సామాగ్రి సమకూర్చాలని దేవాదాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. థర్డ్ వేవ్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా విస్తృత ప్రచారం చేయాలనీ, జాతరకు వచ్చే భక్తులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ లను సంప్రదించాలని అన్నారు. నాగోబా జాతర విధుల్లో ఉండే ప్రతి ఒక్కరు డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని, అర్హత గల వారు, ఫ్రంట్ లైన్ వర్కర్ లు బూస్టర్ డోస్ తప్పని సరిగా తీసుకోవాలని అన్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. భక్తులు ఒక చోట గుమిగూడకుండా పోలీస్ అధికారులు పర్యవేక్షించి కోవిడ్ నిబంధనలు పాటించేలా భక్తులకు తెలియజేయాలని అన్నారు. ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి అంకిత్ మాట్లాడుతూ, మర్రి చెట్టు దగ్గరి పనులు వేగవంతం చేయాలని కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉందని అన్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా భక్తులకు అవసరమైన భోజన వసతి ఏర్పాట్లకు సరుకులు సమకూర్చాలని అన్నారు. అధికారులకు కేటాయించిన విధులను తప్పని సరిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశం లో ASP హర్షవర్ధన్, సర్పంచ్ రేణుక, APO జనరల్ భీం రావు, పూజారులు, అధికారులు, గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post