DPRO ADB- కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలి- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం రోజున స్థానిక జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. శుక్రవారం జరగనున్న స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలను సమర్థవంతంగా, ఎలాంటి లోపలకు తావివ్వకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారులు, ఏజెంట్ లు కూర్చునే ఏర్పాట్లను, ఓటు వేసే కంపార్ట్మెంట్, వెబ్ కాస్టింగ్ కెమెరాల అమర్చిన విధానంలను కలెక్టర్ పరిశీలించారు. నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లను విల్ చైర్ లో ర్యాంప్ ల మీదుగా పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లాలని సూచించారు. ఓటర్ల సెల్ ఫోన్ లను పోలింగ్ కేంద్రం లోనికి అనుమతించకుండా సెల్ పాయింట్ ను ఏర్పాటు చేయాలనీ సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య, అభ్యర్థుల వివరాలు తదితర ఏర్పాట్లను నిర్వహించాలని, మెడికల్ డెస్క్ ఏర్పాటు చేయాలనీ, త్రాగునీరు సమకూర్చాలని, వీడియోగ్రఫీ నిర్వహించాలని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DSP వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రాజేశ్వర్, జోనల్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, పోలింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post