DPRO ADB- క్రమబద్దీకరణ సర్వేను వేగవంతం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వ నిబంధనల మేరకు అనధికార ఇంటి స్థలాల క్రమబద్దీకరణ సర్వేను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్ లో ప్రత్యేక బృందాలు చేపడుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 58, 59 ఉత్తర్వుల ప్రకారంగా సర్వే నిర్వహించాలని, ఇంటి యజమాని అనధికారికంగా నిర్మించిన భవనాలు, కొలతలు సేకరించడం తో పాటు పూర్తి వివరాలను సేకరించి ఆన్ లైన్ యాప్ లో పొందుపరచాలని అన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ రిసోర్స్ పర్సన్ లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఇంటి యజమానులు గుర్తించి వివరాలను సేకరించాలని గుర్తించారు. దరఖాస్తు దారులకు ముందస్తు సమాచారాన్ని మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది సహకారం తో యజమానికి సమాచారాన్ని అందించాలని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయం, సాయంకాలం వేళల్లో సర్వే నిర్వహించాలని సూచించారు. ఖాళీ స్థలాలకు నిబంధనల ప్రకారం రిజక్ట్ చేయాలనీ, క్రమబద్దీకరణకు అవసరం లేని వారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని రిజక్ట్ చేయాలనీ సూచించారు. ఈ సర్వేలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా పశు సంవర్ధక అధికారి రంగారావు, డిసిఓ శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, గ్రామీణ తహసీల్దార్ శివరాజ్, భుకొలతల సహాయ సంచాలకులు రాజేందర్, ఇతర రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం రిక్షా కాలనీ సర్వే నంబర్ 2/3 26 గుంటల భూమిలో ఏర్పాటు చేయుటకు తలపెట్టిన క్రీడా ప్రాంగణం స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు మున్సిపల్ డెప్యూటీ ఈఈ తిరుపతి ఉన్నారు.

Share This Post