DPRO ADB-గ్రామాలలో నెలకొన్న సమస్యలను పల్లెప్రగతిలో పరిష్కరించేలా చర్యలు చేపట్టండి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గ్రామాలలో నెలకొన్న సమస్యలను పల్లెప్రగతిలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్, దొడంద, ఉట్నూర్ మండలం జైత్రం తాండ లలో నిర్వహించిన 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో ఖానాపూర్ శాసన సభ్యురాలు రేఖ శ్యాం నాయక్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన నిర్వహించిన ఆయా గ్రామసభలలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతకు, పచ్చదనం పెంపునకు, ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో తలెత్తిన త్రాగునీటి సమస్యలను ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో పరిష్కరించాలని అన్నారు. ముఖ్యం గా గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. మురుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి పెండింగ్ బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలని సూచించారు. గ్రామాలలో నెలకొన్న లూస్ వైర్ లను, వంగిపోయిన విద్యుత్ స్తంభాల సరిచేయాలని విద్యుత్ shaka అధికారులకు సూచించారు. ఖానాపూర్ శాసన సభ్యురాలు మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. గ్రామాలలో త్రాగునీరు, విద్యుత్, ఫించన్ లు, మరుగుదొడ్లు, భూ సంబంధిత తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని వివరించారు. అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు నీటి సౌకర్యం లేని ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీరందించాలని RWS అధికారులను ఆదేశించారు. మారుమూల గిరిజన గ్రామాలు, తండాల ప్రజలకు వైద్య సౌకర్యం కల్పించేందుకు సబ్ సెంటర్ మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. అంతకు ముందు ఇంద్రవెల్లి మండలం దొడంద గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాలలో ఆదిమ గిరిజన అభివృద్ధి సలహా మండలి చైర్మన్ లక్కే రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్, RWS ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post