DPRO ADB- గ్రామాల్లోని పనులను పూర్తిచేసి వివరాలు అప్ లోడ్ చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

స్మశాన వాటికలు, సేగ్రిగేషన్ షెడ్ లు, కల్లాల నిర్మాణాల ఎఫ్.టి.ఓ. లు త్వరిత గతిన అప్ లోడ్ చేయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం రోజున స్థానిక టిటీడీసీ లో ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, ఎపిఓ లు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్మాణాలు పూర్తైన స్మశాన వాటికలు, సేగ్రిగేషన్ షెడ్ లు, కల్లాల నిర్మాణాల ఎఫ్.టి.ఓ. లు ఇప్పటి వరకు అప్ లోడ్ చేయక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్ లోడ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసు లు జారీ చేయాలనీ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. ఆయా సర్పంచ్ ల సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులను వారం లోగా పూర్తీ చేయాలనీ స్పష్టం చేశారు. వారం అనంతరం మళ్ళి సమీక్షిస్తానని అప్పటి వరకు ఎఫ్.టి.ఓ. లు అప్ లోడ్ చేయని వారిపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను అలసత్వం చేయడం కఠినంగా పరిగణించ బడుతుందని, ఆయా అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ఏంసీసీ, డిసీసీ స్మశాన వాటికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను అప్ లోడ్ చేయాలనీ అన్నారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ఎంపీడీఓ లు ఆయా సర్పంచ్ లతో మాట్లాడి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిబ్రవరి మాసం లో క్షేత్ర పర్యటన నిర్వహిస్తామని, ఆ పర్యటనలో నిర్మాణాలు పూర్తీ కానట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మండల పరిషత్ అధికారులు సేగ్రిగేషన్ షెడ్, క్రిమిటోరియం నిర్మాణ పనులను పరిశీలించాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, వచ్చే వారం లోగా నిర్మాణాలు పూర్తీ చేసి ఎఫ్.టి.ఓ. లు అప్ లోడ్ చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ఈఈ మహావీర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాకుమారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, ఇంజనీరింగ్ అధికారులు, ఎపిఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post