DPRO ADB-గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నిర్వహిస్తుంది- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం తాంసి మండలం అంబుగాం గ్రామంలో లో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కొమురం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
గ్రామంలోని వీధుల గుండా పాదయాత్ర చేస్తూ నీటి ట్యాంక్ క్లోరినేషన్ నిర్వహణను, వైకుంఠ ధామం, సెగ్రిగేశన్ షేడ్, నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షేడ్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేలా, పచ్చదనాన్ని పెంపొందించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు మరుగుదొడ్లను వినియోగించాలని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. గత పల్లె ప్రగతిలో వైకుంఠ ధామం, సేగ్రిగేషన్ షెడ్, ట్రాక్టర్, ట్రాలీ, నర్సరీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను ఈ పల్లె ప్రగతిలో చేపట్టాలని సూచించారు. వచ్చే హరితహారంలో పచ్చదనం పెంపొందేలా రోడ్లకు ఇరువైపులా, డంపింగ్ యార్డ్, సేగ్రిగేషన్ షెడ్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో విరివిగా, మల్టి లేయర్ పద్దతిలో మొక్కలు నాటాలని అన్నారు. గ్రామంలో తుప్పు పట్టిన, వదులుగా ఉన్న వైర్లు, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేయాలనీ అన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు చెరువు మంజూరుకు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కొరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జెడ్పీటీసీ టి. రాజు మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తుల సహకారం తో అభివృద్ధి పనులను చేపడుతున్నామని వివరించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు కళాశాల సమయానుకులంగా బస్సుల వేళలను మార్చాలని ఈ సందర్బంగా కలెక్టర్ ను కోరారు. అంతకు ముందు పంచాయితీ కార్యదర్శి గ్రామసభలో గ్రామంలో చేపట్టిన చేపడుతున్న పనుల నివేదికను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శనం, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్ జాడే, ఎంపిడిఓ భూమయ్య, సర్పంచ్ తుర్ప బాయి, అధికారులు, గ్రామస్తులు, తది తరులు పాల్గొన్నారు.

Share This Post