గ్రామీణ యువతను క్రీడా రంగాల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం తాంసీ మండలం సావర్ గాం గ్రామంలో బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూ రావు తో కలిసి ఆమె తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ముందుగా పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ యువతను క్రీడలలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కబడ్డీ, ఖో ఖో, వాలీ బాల, తదితర క్రీడల్లో యువత రాణించాలని అన్నారు. జిల్లాలో మండలానికి రెండు చొప్పున, పట్టణంలో రెండు 36 క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రేపటి ( జూన్ 3) నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టనున్న పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయం చేసుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ సూచించారు. బోథ్ శాసన సభ్యులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువత ఆటలలో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి పథకాలు సాధించాలని అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా ఈ రోజు క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఓ రవీందర్ రాథోడ్, జడ్పీటీసీ టి.రాజు, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ భూమయ్య, సర్పంచ్ భరత్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- గ్రామీణ యువత క్రీడా రంగాల్లో రాణించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – బెస్ట్ అవలెబుల్ పథకం క్రింద లాటరీ పద్దతి ద్వారా విద్యార్థులు ఎంపిక- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.