DPRO ADB- గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేపడుతున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

టిఎస్ పిఏస్సీ గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున టిఎస్ పిఏస్సి కార్యదర్శి హైదరాబాదు నుండి కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 19 సెంటర్ లలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, 6200 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షకు జిల్లాలో హాజరు కానున్నారని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలలో గదిని బట్టి 24/36/48 మంది అభ్యర్థులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతర్గత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్ లు, సూపరింటెండెంట్ లు, ఇతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post