DPRO ADB- చనాకా- కొరాటా బ్యారేజి, పంప్ హౌస్ పనులు వేగవంతం చేయాలి- ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మిత సబర్వాల్.

చనాకా- కొరాటా బ్యారేజి, పంప్ హౌస్ పనులు వేగవంతం చేయాలనీ ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. సోమవారం రోజున చనాకా- కొరాటా పంప్ హౌస్ పనులను కలెక్టర్ తో కలిసి ఆమె పరిశీలించారు. మొదట పంప్ హౌస్ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ, బ్యారేజి పనులను వచ్చే జూన్ 15 నాటికి పూర్తిచేయాలని, మే నెలాఖరు లోగా పంప్ హౌస్ ట్రయల్ రన్ నిర్వహించాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జూన్ నాటికి వర్షాలు పడే అవకాశం ఉండడం వలన బ్యారేజి పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. అలాగే ట్రయల్ రన్ నిర్వహించడం ద్వారా బ్యారేజి లోని నీటిని ఎత్తి పొసే అవకాశాలు ఉంటాయని సూచించారు. అవసరమైన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న, ENC వెంకటేశ్వర్లు, CE శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, SE పి.రాము, క్వాలిటీ కంట్రోల్ సిఇ వెంకట కృష్ణ రావు, ఈఈ రవీందర్, ఆర్డీఓ రాజేశ్వర్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post