చనాక కొరాటా బ్యారేజి కాలువ పనులు, పిప్పల్ కోటి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున పిప్పల్ కోటి పంప్ హౌస్ సమీపం లోని ప్రధాన కాలువ, డి-1, మల్లింపు నియంత్రకం, పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంప్ హౌస్ ట్రయల్ రన్ కు సిద్ధం చేయాలనీ అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. తొలుత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో భూ సేకరణ అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కాలువను పరిశీలించిన అనంతరం డిస్ట్రిబ్యూటరీ కాలువ -1 ప్రాంతాన్ని పరిశీలించి నీటి ప్రవాహం, ఆయకట్టు, తదితర అంశాలను మ్యాప్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. పిప్పల్ కోటి రిజర్వాయర్ కు వెళ్లేందుకు నాలుగు కిలో మీటర్ల డైవర్షన్ రోడ్డుకు భూసేకరణ పనులు పూర్తిచేయాలని కోరారు. అనంతరం పిప్పల్ కోటి రిజర్వాయర్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి నీటి సామర్థ్యం, ఆయకట్టు, తదితర వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఎస్ఈ పి.రాము, ఆర్డీఓ రాజేశ్వర్, డిప్యూటీ ఈఈ లు తులసి రామ్, మురళి కృష్ణ, సునీల్, ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB -చనాక కొరాటా బ్యారేజి కాలువ పనులు, పిప్పల్ కోటి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.