ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేలా, ఓటర్ నమోదుకు గర్వపడేలా, ఓటు వేసేందుకు సిద్ద పడేలా ప్రతి ఓటర్ సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 జాతీయ ఓటర్ దినోత్సవాన్ని 25 జనవరి 2022 న జిల్లా, మండల బూత్ స్థాయి లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ గురించి, ఓటు హక్కు విలువ గురించి తెలుపుతూ ప్రతిజ్ఞ చేయించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో 18 ఏళ్ళు నిండిన యువతి యువకులను ప్రోత్సహిస్తూ వారి పేరును ఓటర్ నమోదు చేయించుకోవడం వంటి విషయాలపై ద్రుష్టి సారించాలని అన్నారు. ఓటు వలన ప్రశ్నించే తత్త్వం, జవాబుదారీ తనం, ఓటు విలువలు వంటివి తెలుసుకోవచ్చని అన్నారు. మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే జాతీయ ఓటర్ దినోత్సవాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విజయవంతం చేయాలనీ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.