DPRO ADB- జిల్లాకు కేటాయించబడిన జిల్లాస్థాయి ఉద్యోగుల సమాచారాన్ని IFMIS పోర్టల్ లో నమోదు చేపడుతున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన సందర్బంగా జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగుల సమాచారాన్ని IFMIS పోర్టల్ లో నమోదు ప్రక్రియ చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపు వివరాలను మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో IFMIS పోర్టల్ లో నమోదు కార్యక్రమాన్ని ఆయా జిల్లా శాఖాధిపతుల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వు నెం. 317, తదనంతరం జారీ చేయబడిన సర్కులర్ మెమోల ఆధారంగా కమిటీల సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల కేటాయింపు, పోస్టింగ్ ఉత్తర్వులను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో జిల్లా స్థాయి క్యాడర్ లలో పని చేస్తున్న 1143 మంది ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు కేటాయించగా, 892 మంది ఉద్యోగులు ఆయా జిల్లాల నుండి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగుల సమాచారం ప్రభుత్వ IFMIS పోర్టల్ లో నమోదు జరుగుచున్నదని వివరించారు. అట్టి సమాచారాన్ని క్రోడీకరించి నమోదు ప్రక్రియ నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులచే టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్ లు పర్యవేక్షిస్తున్నారు.

Share This Post