DPRO ADB- జిల్లాలోని ప్రజలందరికీ 2022 – నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్బంగా జిల్లాలోని ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో జిల్లాలోని ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఆర్థికంగా జీవించాలని ఆకాంక్షించారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో కరోనా వలన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. థర్డ్ వేవ్ ప్రబలకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ప్రజలందరు కరోనా నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. జిల్లాలో అర్హులైన వారందరు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఈ డిసెంబర్ మాసంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించారని తెలిపారు.

Share This Post