DPRO ADB- జిల్లాలో టిఎస్- ఐపాస్, టి- ప్రైడ్ క్రింద అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు మంజూరు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో టిఎస్- ఐపాస్, టి- ప్రైడ్ క్రింద అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు మంజూరు జారీ చేయడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం జులై నుండి ఆగస్టు 31 వరకు టిఎస్- ఐపాస్ క్రింద ఐదు పరిశ్రమలకు దరఖాస్తులు రావడం జరిగిందని, ఇందులో 3 పరిశ్రమల స్థాపనకు ఆయా శాఖల సిఫారసు మేరకు జిల్లా కమిటీ అనుమతి మంజూరు చేయడం జరిగిందని, మిగితా రెండు పరిశ్రమలకు అభ్యంతరాల కారణంగా తిరస్కరించడం జరిగిందని తెలిపారు. టి- ప్రైడ్ క్రింద షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభ్యర్థులు రవాణా సెక్టర్ క్రింద ఆరు దరఖాస్తులు రావడం జరిగిందని, ఇందులో 48.40 లక్షల వ్యక్తిగత వాటా కాగా, 18.41 లక్షల రూపాయలు సబ్సిడీ క్రింద మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, విద్యుత్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post