జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాలు సంతృప్తిగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రత్యేక అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమీషనర్ కె.నర్సింహులు తెలిపారు. నాలుగు రోజుల పాటు జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాల పర్యవేక్షణ సందర్భంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని కలెక్టర్ కు తెలియజేశారు. ఇప్పటి వరకు జామిడి, ముక్రా-కె, పొన్నారి, సుంకిడి, ఖోడద్ గ్రామాలలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించినట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ ఉన్నారు.