జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మన ఊరు- మన బడి కార్యక్రమం అమలుకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన ఊరు- మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ వంటి పనులను చేపట్టాలని సూచించారు. రెండు రోజుల్లోగా ప్రతి పాఠశాల అంచనాలను సిద్ధం చేసి సమర్పించాలని, వాటికి పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. 15 వ తేదీలోగా 30 లక్షల లోపు అంచనాతో చేపట్టే పనులను ప్రారంభించాలని తెలిపారు. ఈ నెలాఖరు వరకు 30 లక్షల పైన ఖర్చుతో చేపట్టే పనులను ప్రభుత్వ నిబంధలు ప్రకారం టెండర్లు పూర్తిచేసి వందశాతం పనులు ప్రారంభించాలని అన్నారు. పాఠశాలల్లో సుందరీకరణ, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున మోడల్ పాఠశాలలుగా ఈ నెలాఖరు లోగా తీర్చిదిద్దాలని సూచించారు. అంచనాలను సిద్ధం చేసిన ప్రతి పాఠశాలను క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు సందర్శించి ద్రువీకరించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, మన ఊరు- మన బడి క్రార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికైన 237 పాఠశాలల్లో త్రాగునీరు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ రాజ్ ఈఈ మహావీర్, ఇతర ఇంజనీరింగ్, విద్యా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
ITDA UTNOOR: గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
-
DPROADB- ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB- అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పి.ఎస్.
-
DPRO ADB: పట్టణ ప్రజలు తమ ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.