DPRO ADB- జిల్లాలో రక్త హీనతతో బాధ పడుతున్న పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో రక్త హీనతతో బాధ పడుతున్న పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గ్రామీణ, మావల మండలాల అంగన్వాడీలు, ఆశా, ANM, ఇతర గ్రామస్థాయి అధికారులకు పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారం పై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 60 శాతం మంది రక్తహీనత తో బాధపడుతున్నారని, సర్పంచ్ లు, ఆశా, ANM, అంగన్వాడీ ల నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఆరోగ్య పోషకాహార దినోత్సవాన్ని నిర్వహించాలని అన్నారు. ఎత్తు, బరువు లోపంతో ఉన్నా పిల్లలను, రక్తాహీనత తో బాధ పడుతున్న గర్భిణీలను, బాలింతలను గుర్తించి ప్రత్యేక వైద్య చికిత్సలతో పాటు పౌష్ఠిహారాన్ని అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు బాలమృతాన్ని అందించాలని అన్నారు. 12 నుండి 17 సంవత్సరాల వయసుగల పిల్లలకు ఐరన్ మాత్రలను ఇవ్వాలన్నారు. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లను వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, రక్తహీనత పై అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి నియంత్రణకు కృషి చేయాలనీ సూచించారు. అనంతరం జిల్లాలో రక్తహీనతను సమూలంగా నియంత్రించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా అనీమియా నియంత్రణ అధికారి డా.పవన్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, సఖి కేంద్రం పరిపాలనాధికారి యశోద, ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, అంగన్వాడీలు, ఆశాలు, ANM లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post