DPRO ADB -జిల్లాలో హరిత హారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేలా శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

హరితహారం ఎనిమిదవ విడతలో భాగంగా 44.74 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణకు హరితహారం 8 వ విడత కార్యక్రమం అమలుపై చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో హరిత హారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేయాలనీ అన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎండ‌లు తీవ్రంగా ఉన్నందున నర్సరీలోని మొక్కలకు ప్రతి రోజు నీటి వ‌స‌తి క‌ల్పించాలని అన్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వార్డుల వారిగా ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి ప‌చ్చ‌ద‌నం పెంపు కోసం ప్ర‌ణాళిక రూపొందించాలని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖ రహదారులకు ఇరువైపులా, స్మశాన వాటికలు, రైతువేదికలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలలో విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ సూచించారు. జిల్లాలో గిరివికాసం పథకం లో భాగంగా 213 బోర్ వెల్ లకు విద్యుద్దీకరణ ఏర్పాటు చేయుటకు 2 కోట్ల 45 లక్షలు చెల్లించడం జరిగిందని, త్వరితగతిన పనులు పూర్తిచేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, అటవీ అభివృద్ధి అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post