DPRO ADB-జిల్లా స్థాయి పోస్టుల సిబ్బంది వివరాలను సేకరించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా స్థాయి పోస్టుల సిబ్బంది వివరాలను సేకరించి జాబితాను సిద్ధం చేసుకొని, సిబ్బంది కేటాయింపులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున BRK భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా స్థాయి పోస్ట్ ల ఆధారంగా కేటాయింపులు నిర్వహించాలని, ప్రతి ఉద్యోగి నుండి అప్షన్ తీసుకోవాలని, ప్రాధాన్యత క్రమంలో సీనియారిటీ ఆధారంగా కొత్త జిల్లాలకు సిబ్బందిని కేటాయించాలని అన్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలు, వితంతువులు, దివ్యంగులు, వైద్య కారణాలు ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆయా జిల్లా శాఖ అధికారులతో సమన్వయము చేస్తూ సిబ్బందిని కేటాయించాలని అన్నారు. ఈ నెల 20 నాటికీ కేటాయింపుల ప్రక్రియ పూర్తిచేసి ఉత్తర్వులు జారీ చేయాలనీ ఆదేశించారు. బదిలీ అయిన ఉద్యోగి మూడు రోజుల్లోగా విధుల్లో చేరవలసి ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా కృష్ణ భాస్కర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు సీనియారిటీ, కేటాయింపులు, ప్రాధాన్యత, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న జిల్లా స్థాయి ఉద్యోగుల వివరాలను సేకరించి సీనియారిటీ ప్రక్రియ పూర్తీ చేసి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయింపులు చేపడతామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న జిల్లా స్థాయి సిబ్బంది ఆయా శాఖాధికారులు వివరాలు సేకరించి సీనియారిటీ పూర్తీ చేయాలనీ అన్నారు. కొత్త జిల్లాల అధికారులతో సమన్వయము చేసుకుంటూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి నుండి ఆప్షన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 20 లోగా సిబ్బంది కేటాయింపులు పూర్తీ చేయడానికి అన్ని శాఖల అధికారులు సిబ్బంది వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచేసుకోవాలని అన్నారు. సిబ్బంది కేటాయింపులు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా సహకారం అందించాలని అన్నారు. ఏమైనా పరిపాలన సంబంధమైన అంశాలపై వివరణ అవసరమైన పక్షంలో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ రాజేష్ చంద్ర, ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా గ్రామీణభివృద్ది అధికారి కిషన్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post