ఆదిలాబాదు స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ లను స్థానిక టీటీడీసీ లో ఏర్పాటు చేయుటకు ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, టీటీడీసీ లను పరిశీలించారు. టీటీడీసీ లో ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉన్నందున డిస్ట్రిబ్యూషన్ కౌంటర్, రిసెప్షన్ కౌంటర్ లను ఏర్పాటు చేయుటకు నిర్ణయిస్తున్నట్లు ప్రాథమికంగా తెలిపారు. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు టీటీడీసీ లో చేపట్టుటకు ఏర్పాట్లు చేపట్టాలని సూచనప్రాయంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB – డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటర్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
DPRO ADB- విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB -పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB -చనాక కొరాటా బ్యారేజి కాలువ పనులు, పిప్పల్ కోటి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
-
DPRO ADB- మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను వెంటనే ప్రారంభించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.